కుత్బుల్లాపూర్, మార్చి14 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్‌రెడ్డి వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లోని పోలీస్స్టేషన్లలో కూడా సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదులు చేశారు. ఫిలింగనర్‌లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఈనెల 12 రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని రాజకీయ పార్టీల నడుమ ద్వేషాన్ని, హింసను ప్రేరేపించేలా ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్రిక్తతలు పెరగడంపాటు శాంతిభద్రతలను దెబ్బతీసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు.
స్టేచర్ నుంచి స్ట్రెచర్ మీదకు చేరుకున్నారని, అక్కడి నుంచి మార్చురీకి వెళ్తారంటూ చేసిన అవాంఛనీయ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు కుర్వ విజయ్‌కుమార్, తొట్ల స్వామియాదవ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్డండ వెంకటేశ్, రాజు జేజోల తదితరులు పాల్గొన్నారు. పేట్ బషీరాబాద్‌లో శంభీపూర్ రాజు, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎంగా పదేండ్లపాటు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన కేసీఆర్‌పై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయనపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఎదుటివారి వినాశనాన్ని కోరుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. దుబ్బాకలో పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు ఆస స్వామి, పర్స కృష్ణ, మల్లేశం గౌడ్, మంచిర్యాలలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, తోట తిరుపతి, ఎర్రం తిరుపతి, పడాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.