వేములవాడ, జూన్ 1: రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతోనే కోడెలు పిట్టల్లా రాలిపోయాయని, ఇందుకు కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వేములవా డ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎకడ చీమ చిటుకుమన్నా మాట్లాడే స్థాని క ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ కోడెల మృ త్యువాత పడుతున్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆరు నెలల క్రితం మంత్రి కొండా సురేఖ సిఫారసు లేఖతో ఒకరికి 60 కోడెలు కేటాయించడం వివాదాస్పదంగా మారి ఈ పంపిణీ ఆగిపోవడంతో 500 కోడెలను ఉంచే తిప్పాపూర్ గోశాలలో 1200కు పైగా ఉంచారని పేర్కొన్నారు. దీంతో కోడెలు అనారోగ్యం బారిన పడి సరైన ఆహారం అందక మృత్యువాత పడుతున్నాయని పశు వైద్యాధికారులే నిర్ధారించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గడిచిన మూడు రోజుల్లో తిప్పాపూర్ గోశాలలో 18 కోడెలు మృతి చెందాయని తెలిపారు. ఆహారం లేక కోడెలు మృతి చెందితే అధికారులు, నాయకులకు కనీస మానవత్వంలేదని మండిపడ్డారు.