KTR | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన స్టాఫ్ నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ సర్కార్ తమ ఖాతాలో వేసుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వేరే వాళ్ల క్రెడిట్‌ను కొట్టేయడం ఇదే తొలిసారి కాదని.. అలాగే చివరి సారి కూడా కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని క్రెడిట్ చోర్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.
6956 స్టాఫ్ నర్స్ పోస్టులు, 15,750 పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యిందని కేటీఆర్ తెలిపారు. కానీ దురదృష్టవశాత్తూ ఎన్నికల కోడ్ రావడం వల్ల వాటి ఫలితాలు ఇవ్వలేకపోయామని తెలిపారు. వీటిపై నూతన ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుమాలిన విషయమని విమర్శించారు.