ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం.. ఔటర్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: డీజీపీ ఆనంద్
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉకుపాదం మోపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
- ప్రజలకు అసౌకర్యం కలుగకుండా విధులు నిర్వర్తించండి
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉకుపాదం మోపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. శనివారం డీజీపీ కార్యాలయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి ఆందో ళన వ్యక్తం చేశారని, ప్రమాదాల నివారణకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. నగరంలో వాహనదారులకు, సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ పోలీసులు విధులను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్‌సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయనున్నదని, దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతున్నదని వెల్లడించారు. ఈ బ్యూరో అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ చందన దీప్తితో, ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, కాజల్ సింగ్, రాహుల్ రెడ్డి, అవినాష్ కుమార్, శేషాద్రిని రెడ్డి, శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

