హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, గతంలో దీనికోసం ఆ పార్టీ పోరాడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు. నేడు అదే పార్టీ బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని, ఆపార్టీకి ఆ అర్హతే లేదని తేల్చిచెప్పారు. ఇస్లాం మతం స్వీకరించిన బీసీలకు రిజర్వేషన్లు పర్తింపజేయడానికి వీలులేదని కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడాన్ని ఖం డించారు.
బీజేపీ ప్రతి అంశాన్ని మతం తో జోడించడం సరైందికాదని తెలిపా రు. బీజేపీ దేశవ్యాప్తంగా బీసీల హకులను కాలరాయడంతోపాటు, రాష్ట్రం లో బీసీల పేరుతో ముస్లిం, మైనారిటీల హకులను కాలరాసే వైఖరి అవలంబిస్తున్నదని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని మతంతో జోడించి, మత ఘర్షణలను సృష్టించడమనేది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. సామాజిక హోదా, కులాల అణిచివేత ఆధారంగా రిజర్వేషన్లు కోరుకోవాలని, రాజ్యాంగస్ఫూర్తి కూడా అదే చెప్తున్నదని పేర్కొన్నారు.