హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): బాలికపై బండి భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బండి భగీరథ్ చర్యలను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని, నిష్పక్షపాత విచారణ జరుపాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని చెప్పారు. ఈ దారుణంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, పౌరసమాజం నిరసనలు తెలుపుతున్నా, నిందితుడిపై పోక్సో కేసు నమోదైనా పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగంపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్లే కారణమని, బీజేపీ పలుకుబడిని ఉపయోగించి కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు.