హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీకే అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. బస్సుల నిర్వహణ మొత్తం ప్రైవేట్, కార్పొరేట్లకు కట్టబెట్టి ఆయా కంపెనీలకే కేంద్ర ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు సబ్సిడీగా ఇస్తుందని ఆరోపించారు.
అత్యంత విలువైన ఆర్టీసీ భూములు కూడా ప్రైవేట్ విద్యుత్ బస్సుల సంస్థలకు కట్టబెడుతున్నారని మం డిపడ్డారు. వీటికి సంబంధించిన టెండర్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఖరారు చేసి, ఆర్టీసీపై పెనుభారం వేస్తుందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజల అ వసరాలకు అనుగుణంగా రవాణా సదుపాయాలను సమకూర్చాలని, విద్యుత్ బస్సుల పేరుతో భారాన్ని ప్రయాణికులపై వేయడం తగదని ఆయన జాన్‌వెస్లీ సూచించారు. ఇప్పటికైనా విద్యుత్‌చార్జీల నిర్వహణ ఆర్టీసీకే అప్పగించాలని కోరారు.