హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు బకాయిలు చెల్లించలేదని తెలిపారు.
రానున్న రోజులకు అవసరమైన ఆర్డర్లు కూడా ఇవ్వలేదని, ఫలితంగా ఉత్పత్తులు చేయలేమని యజమానులు చేతులెత్తేశారని పేర్కొన్నారు. దీంతో ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డ 30 వేల కార్మిక కుటుంబాలు వీధినపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి.. వస్త్ర పరిశ్రమను, కార్మికులను ఆదుకోవాలని ఎస్ వీరయ్య కోరారు.