బీజేపీ దుష్టపాలనను అంతమొందించాలి
కేంద్రంలోని బీజేపీ దుష్టపాలనను ప్రజలు అంతమొందించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో సీపీఎం జన చైతన్యయాత్రను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్యతో కలిసి ప్రారంభించా రు.
- ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల కక్షసాధింపు
- ఈడీ విచారణ పేరిట ఎమ్మెల్సీ కవితకు వేధింపులు
- సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
- ఆదిలాబాద్‌లో జన చైతన్యయాత్ర
ఆదిలాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ)/నిర్మల్: కేంద్రంలోని బీజేపీ దుష్టపాలనను ప్రజలు అంతమొందించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో సీపీఎం జన చైతన్యయాత్రను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్యతో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడు తూ ఎనిమిదేండ్లుగా అవినీతి, అక్రమాలు, మతోన్మాదం పేరిట బీజేపీ ఆగడాలను ప్రజలకు వివరించడానికే ఈ యాత్ర చేపట్టినట్టు వివరించారు.
బీజేపీ ప్రభుత్వం దేశ సంపద ను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నదని ఆరోపించారు. కేంద్రంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నేతలపై మోదీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నదని, ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ పేరిట వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని ధ్వజమెత్తారు. సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర నిర్మల్‌కు చేరుకున్న సందర్భంగా ఆ పార్టీ నేత వీరయ్య మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ భావాలతోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు నడుస్తున్నదని, మతోన్మాదాన్ని ప్రేరేపించి ఓటు రాజకీయలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

