హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసి, అదానీకి కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. విద్యుత్ ప్రైవేటీకరణతో సబ్సిడీలు రద్దయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు.
సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్రకమిటీ సభ్యురాలు జ్యోతితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ రెండు డిస్కంలు ఉన్నాయని, మరో కొత్త డిస్కం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని తెలిపారు. ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.