పంటల కొనుగోలులో ప్రభుత్వం విఫలం
రైతులు పండించిన వరి, మక్కజొన్న, ఇతర పంట ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు.
- నేడు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు సీపీఎం నేతలు: జాన్వెస్లీ
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగా ణ): రైతులు పండించిన వరి, మక్కజొన్న, ఇతర పంట ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు కేంద్రాల్లోని అస్తవ్యస్త పరిస్థితులతో రైతులు అల్లాడుతు న్నా.. అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ కమిటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, నల్లగొండ, ఉత్తర తెలంగాణ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరతతో రైతు లు ఒక్కో బస్తాకు రూ.30 అదనంగా చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సీపీఎం బృందాలు సందర్శించాలని, 11న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని జాన్వెస్లీ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

