హైదరాబాద్: కాంగ్రెస్కు కటిఫ్ చెప్పిన సీపీఎం (CPM) ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఇందులో భాగంగా 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆయన ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీచేస్తున్నారు.
బీజేపీ గెలిచే చోట ఓడించగలిగే అభ్యర్థులకే ఓటెయ్యాలని తమ్మినేని సూచించారు. సీపీఎంకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో తాము మద్దతిస్తామని, అక్కడ తాము పోటీ చేయడం లేదన్నారు. కోదాడ, హుజూర్నగర్సహా మరో స్థానానికి అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు. పొత్తుపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సీయర్ నేత జానారెడ్డి.. తమ్మినేనితో ఫోన్లో మాట్లాడారు. అభ్యర్థుల జాబితా విడుదలను వాయిదా వేయాలని కోరారు. అయితే అది కుదరని జానారెడ్డికి స్పష్టం చేశారు.