హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పేర్కొనడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమిత్షా వ్యాఖ్యలు దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా?
అనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను చంపడంపై ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.