హైదరాబాద్, జూలై 31 (నమస్తేతెలంగాణ): సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 19 నుంచి 21 తేదీ వరకు మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఘ నంగా నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
మహాసభల పోస్టర్ ఆవిషరణ కార్యక్రమం గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్లో నిర్వహించారు. మహాసభలు జరిగే ప్రాంతానికి సీపీఐ రాష్ట్రసహాయ కార్యదర్శి, దివంగత ఎన్ బాలమల్లేశ్నగర్గా నామకరణం చేసినట్టు కూనంనేని పేర్కొన్నారు. వందేళ్ల ప్రస్థానంతో ముందుకు సాగుతున్న సీపీఐని ప్రజలతో మరింత మమేకం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర మహాసభలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు.