Batwara 1947 | దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ ‘బట్వారా 1947’.. విడుదల తేదీ ఖరారు!
Batwara 1947 | బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ హిస్టారికల్ డ్రామా చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.
Batwara 1947 | బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ హిస్టారికల్ డ్రామా చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకు ‘లాహోర్ 1947’ (Lahore 1947) అనే వర్కింగ్ టైటిల్‌తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పేరును అధికారికంగా ‘బట్వారా 1947’ (Batwara 1947) గా మారుస్తూ చిత్రబృందం సరికొత్త మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. దేశ విభజన నాటి భయానక పరిస్థితులు, ద్వేషం మధ్య ఒక వ్యక్తి చూపించిన అసాధారణ ధైర్యం నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగభరితమైన చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా 2026, ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
గతంలో ‘ఘాయల్’, ‘దామిని’, ‘ఘాతక్’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతోషి, సన్నీ డియోల్ కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో సన్నీ డియోల్ సరసన సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింతా నటిస్తుండగా, శబానా అజ్మీ, అలీ ఫజల్, కరణ్ డియోల్, కనికా కపూర్, సర్గమ్ సింగ్, ఖుషీ హజారే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.
In times of hatred and fear, he chose courage.
Watch #Batwara1947 in theatres from 14th August 2026.@iamsunnydeol @realpreityzinta @AzmiShabana @alifazal9 karandeol @sargam.singh44 @khhushihajare @kanikkakapur
@RajSantoshi @AKPPL_Official pic.twitter.com/WYnLAodPEB— Sunny Deol (@iamsunnydeol) June 9, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

