హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ పాలనలో సామాన్యులకు బతుకు భారంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం 12రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.8 వరకు పెంచిందని మండిపడ్డారు.
దేశ చరిత్రలో తక్కువకాలంలో ఇంత మొత్తంలో భారాలు మోపిన ఏకై క ప్రధాని నరేంద్రమోదీ అని ఎద్దేవా చే శారు. ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని చెప్తూ.. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పెంచిన పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.