హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గోబెల్స్‌ను మనం చూడకపోయినా మోదీని చూస్తున్నామని ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రతీ ఘటనను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నదని మండిపడ్డారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నప్పుడే పహల్గాం టెర్రరిస్టులు హతమయ్యారని వార్తలు వచ్చాయని, ఉగ్రవాదులు ముందుగానే దొరికినా.. కావాలనే దాచిపెట్టారా అని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాలు వ్యక్తంచేసిన సందేహాలపై కేంద్రం దాటవేత దోరణిలోనే మోదీ, అమిత్‌షా వైఖరి తేటతెల్లమైందన్నారు.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-1ను శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు. ఆగస్టు 1న ఈ యూనిట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.