హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల హక్కులను కాపాడుకుంటూనే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ సీఎంలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు హైదరాబాద్‌లో సమావేశం కానుండటం శుభదినమని పేర్కొన్నారు.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏ రాష్ర్టానికి రావాల్సిన ప్రయోజనాలను వారు సాధించేందుకు కృషి చేయాలన్నారు. భద్రాచలంలో ముంపు ప్రాంతాలకు సంబంధించిన అంశాలను కూడా సున్నితంగా చర్చించి పరిషరించుకోవాలని కోరారు.
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): భద్రాచలం సమీపంలోని 5 గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇచ్చేందుకు రెండు ఇద్దరు సీఎంలు సానుకూలంగా చర్చించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.
పిచ్చుకలపహాడ్, కన్నాయిగూడెం, ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం గ్రామాలను తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో పెద్ద మనసుతో సీఎం రేవంత్‌తో సానుకూలంగా చర్చించాలని కోరారు.
సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల సీఎంలు ఎస్సీ వర్గీకరణపైనా చర్చించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 30 ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణపైనా ప్రధానంగా చర్చించాలని పేర్కొన్నారు.
మాదిగలపై ఇద్దరు సీఎంలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఢిల్లీ వెళ్లి వర్గీకరణ కోసం కేంద్రంపై ఒ త్తిడి తేవాలని సూచించారు. కేంద్రంలో పదేం డ్లు అధికారంలో ఉన్న బీజేపీ వర్గీకరణ అంశా న్ని ఓటు బ్యాంకుగా మార్చుకుందని మండిప డ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు వర్గీకరణ విషయంలో గట్టిగా స్పందించాలని కోరారు.