ఖమ్మం కమాన్బజార్, జూన్ 30: బొగ్గు బ్లాకుల విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ర్ర్టాల్లో ప్రభుత్వరంగ సంస్థలకు బొగ్గు గనులను కేటాయించినప్పుడు తెలంగాణలో ఎందుకు కేటాయించరని ప్రశ్నించారు.
బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ ఈ నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. బొగ్గు గనుల వేలాన్ని ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.