హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తేతెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గమని, 20సార్లు మార్పులు చేయడంతో అంచనాలు పెరిగి ఆలస్యం జరిగిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పనుల జాప్యంతో పైకప్పు స్లాబు తుప్పుపట్టి ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. 2007, 2015లో కృష్ణానది పరివాహక ప్రాంతాలను సీపీఐ బృందం సందర్శించినప్పుడు శ్రీశైలం సొరంగమార్గం త్వరగా పూర్తిచేసి నల్లగొండ జిల్లాకు నీరందించాలని సూచించామని గుర్తు చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని యుద్ధ ప్రాతిపదికన రక్షించాలని కోరారు.