హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పెట్రో ధరలు పెంచనని అబద్ధపు మాటలు చెప్పిన ప్రధాని మోదీ.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని సీపీఐ జాతీయ నాయకులు కే నారాయణ విమర్శించారు. పెరిగిన పెట్రో ధరలు వినియోగదారులకు భారంగా మారాయని తెలిపారు.
సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా చ మురు బ్యారెల్ రేట్లు పెరిగాయనే కారణంతో హేతుబద్ధత లేకుండానే వారంలోనే లీటర్‌పై రూ.8 వరకు పెంచారని మండిపడ్డారు. ఒకవైపు కేంద్రం పన్నుల పేరుతో చమురు ధరలు పెంచుతుండ గా, రాష్ట్రాలు సైతం సెస్సులతో ప్రజలను బాదేస్తున్నాయని విమర్శించారు.