భువినొదిలిన క్షణం
గుక్కపట్టిన కన్నపేగు కుప్పకూలిన నినుగన్నవారు ఆశ్యర్యంలో బంధువర్గం ఎలా? ఎందుకు? ఎప్పుడు? ప్రశ్నల వర్షంలో నీ పరివారం వాట్సాప్ స్టేటస్‌లో నీ నేస్తాల ప్రేమ సుగంధపు వెల్లువలు
గుక్కపట్టిన కన్నపేగు
కుప్పకూలిన నినుగన్నవారు
ఆశ్యర్యంలో బంధువర్గం
ఎలా? ఎందుకు? ఎప్పుడు?
ప్రశ్నల వర్షంలో నీ పరివారం
వాట్సాప్ స్టేటస్‌లో నీ నేస్తాల
ప్రేమ సుగంధపు వెల్లువలు
అప్పటివరకు ఇన్ని బంధాల
చిక్కుముడుల్లో ఉన్న నువ్వు
నిద్రావస్థలో లీనమైపోతావ్
నీ చుట్టూ ఉన్నా నలుగురు
నిన్ను బాడీ..బాడీ అని సంబోధిస్తూ
నడిరోడ్డు మీదకి తీసుకొస్తారు
కన్నీటితో కొందరు, మౌనంతో కొందరు,
బాధను వెళ్లగక్కుతూ ఉంటారు
వీధంతా జనసందోహంతో నిండిపోతుంది
ఎలా భువినొదిలావో తెలియక
ప్రవచనకర్తల్లా గుంపుగా కూర్చొని
ప్రసంగాలు అల్లుకుపోతూ ఉంటారు
తదుపరి నిన్ను పూలవర్షంతో గర్వంగా
నలుగురు మోస్తూ తీసుకెళ్తూ ఉంటే
నిన్నటివరకు నిన్ను పలకరిస్తూ నవ్విన ఆమె
తలుపు ఠక్కున వేసుకుంటుంది
ఎందుకంటే నువ్విప్పుడు శవం
నీపై చల్లిన పూరేకులు అమంగళమైనవి
మీ ఇంటికొస్తే ఆమెకు అంటు మరి
మీ వీధి చివరలో నీ ఫొటో గాలికి
అటు ఇటు ఊగుతూ వెళ్లిపోయేవారికి
నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది.
నువ్వు భువినొదిలిన క్షణం నిదానంగా
మరుగున పడిపోతుంది
గోడమీద జ్ఞాపకంలా
మదిలో నిన్ను చెరగని ముద్రగా
లిఖించుకున్నవారు మాత్రం
తలుస్తూ కుమిలిపోతూ
జనజీవన స్రవంతిలో కలవలేక,
కలిసినట్టు నటిస్తూ బ్రతికేస్తుంటారు
– వాసి జ్యోత్స్న
9866843005
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

