హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణపట్ల కడుపు నిండా ద్వేషం, గుండె నిండా ద్రోహం ఉన్న ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి మునుగోడులో ఓట్లు అడిగే హకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. తెలంగాణపై వివక్షతోనే విభజన చట్టంలోని ఏ ఒక హామీని అమలు చేయట్లేదని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బయ్యారంలో ఉకు పరిశ్రమను నెలకొల్పలేమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎలాంటి సంప్రదింపులు లేకుండా ప్రకటించారని ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి సాయం అందించని బీజేపీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నదని ప్రశ్నించారు. వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకోవాలి అని హెచ్చరించారు. డబ్బు, అధికారం కోసం రోజుకొక పార్టీ మార్చే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లకు అంకితభావంతో పనిచేసే కమ్యూనిస్టు పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.