హైదరాబాద్ : ప్రధాని మోదీ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్ఎస్ ఖమ్మం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సంఘీభావం తెలిపేందుకు సభకు హాజరయ్యామన్నారు. ‘ఎందుకు సంఘీభావం తెలియాల్సి వచ్చిందంటే.. ఇవాళ భారతదేశం ఎనాడూ లేనంతా సంక్షోభంలో మునిగిపోయింది. ప్రధాని మోదీ రాజనీతిజ్ఞనుడిని అనే అంశాన్ని మరిచిపోయి.. రాజకీయవేత్తలా ప్రవర్తిస్తూ దేశాన్ని ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, రాజ్యాంగం పరమైన సంక్షోభంలో భారతదేశాన్ని నెట్టివేశారు. ఆర్థికంగా చూస్తే ఏనాడూలేని విధంగా డాలర్ రూపాయి విలువ 82కి పడిపోయింది.
ఆకలి సూచీలో భారత్ 107కి పడిపోయింది. మనకంటే బంగ్లా, పాక్ బెటర్ పోజిషనల్లో ఉన్నాయి. కార్మికులు బ్రిటిషన్ కాలం నాడు సంపాదించుకున్న హక్కులు సైతం లేకుండాపోయాయి. ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ధరలు పెరిగితే రాష్ట్రం అనుకుంటాం కానీ.. వాటికి కేంద్రమే కారణం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా దానికి కారణం కేంద్రం. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1200కు చేరింది. పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఎనిమిదేళ్లలో ఎంత మంది నిరుదోగులకు ఇచ్చారో కేంద్రం చెప్పాలి. రైతులకు ఏమైనా మేలు చేశారా అంటే అది లేదు. వందలాది మంది రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి.. అసువులు బాసిన న్యాయం జరుగలేదు. జాతికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. క్షమించాలని కోరిన ప్రధాని.. మళ్లీ ఇవాళ ధాన్యం కొనుగోలు చేయడం లేదు.
మద్దతు ధర ఇచ్చేది లేదు. ఎనిమిదేళ్ల కాలంలో లక్ష మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరికి మంచి జరిగింది. నిరుద్యోగులకు, మహిళలకు, కార్మికులకు ఏమి జరుగలేదు. పారిశ్రామికంగా చూస్తే స్వాతంత్య్రం 5 సంస్థలు ఉండేవి. ఇప్పుడు 400 వరకు ఉంటే.. వాటిని అమ్మేసేందుకు పార్లమెంట్లో చట్టం చేసింది. మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో. మన సొమ్ము, మన సింగరేణి, మన బొగ్గుబావులు, మన రైళ్లను అమ్మే హక్కు ఎవరిచ్చారు. ఇవాళ ప్రశ్నంచడంలో కేసీఆర్ ముందున్నాడు. దేశంలో ముఖ్యమంత్రులందరికంటే ఇవాళ వాదించడంతో వివరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలను మింగేస్తున్నది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. దేశాన్ని కాపాడాల్సిన ప్రధాని మోదీ.. రాష్ట్రం తర్వాత రాష్ట్రాన్ని ఎనిమిదింటిని మింగి.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేశారు. చైతన్యవంతమైన తెలంగాణ గడ్డలో నరేంద్రమోదీ అడుగుపడకుండా కాపాడడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్ఫూర్తిదాయకపాత్ర వహించారు. అబద్ధాలతో బతికేది బీజేపీ పార్టీ. ప్రధాని నరేంద్ర మోదీకి నార్కోటెస్ట్ చేయాలి. మోదీకి రాజ్యాంగంపై ప్రేమ లేదు.. ఆయనకు ఉన్నది మనుధర్మంపైనే ప్రేమ ఉంది. పేదవారిపై ప్రేమల లేదు.. ఆదానీ, అంబానీలపై ప్రేమ ఉన్నది.
వివేకానందు చెప్పిన విషయాలపై, గాంధీపై ప్రేమలేదు.. గాడ్సేపై ప్రేమ ఉన్నదన్నారు. దేశ సైన్యంలో నాలుగో మంది ముస్లింలే ఉన్నారు. హిందు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ అన్నదమ్ములే. ఆ భావనతో కేసీఆర్ ముందుకు వస్తున్నారు. ఈ దేశాన్ని ముక్కలు చేయానికి ప్రయత్నిస్తున్న మోదీని, బీజేపీని వ్యతిరేకించడంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉంది. అందుకని కమ్యూనిస్టులగా అంశాలవారీగా మద్దతు ఇస్తున్నాం. నాజీలను మించిన పాపిష్టి బీజేపీని తరిమికొడుతాం.. హిట్లర్ను మించిన నరేంద్ర మోదీని తెలంగాణ గడ్డలో అడుగుపెట్టకుండా చేద్దాం. ఖమ్మం జిల్లా తరఫున ముందంజలో నిలుద్దాం’ అన్నారు.