హనుమకొండ, జనవరి 29: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమ్యూనిస్టులను అంతం చేయాలనే దురాలోచన చేస్తుందని, ప్రజల పక్షాన నిత్యం పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టులకు అంతం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సీపీఐ వందేళ్ల వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం హనుమకొండలో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి అధ్యక్షతన జరిగిన సభకు చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర సహా య కార్యదర్శి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాడ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభు త్వం నక్సలైట్ల పేరుతో ఎన్కౌంటర్ చేస్తూ కమ్యూనిస్టులను అంతం చే యాలని చూస్తున్నదని ఆరోపించారు.