CPGET 2024 | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ సీపీగెట్ – 2024 ఫైనల్ ఫేజ్ ప్రవేశాలతో పాటు ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల ఫస్ట్ ఫేజ్ ప్రవేశాలకు షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు సీపీగెట్ ఇంచార్జి కన్వీనర్ ప్రొఫెసర్ జలపతి తెలిపారు.
ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. 1వ తేదీన వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు వెబ్ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 4వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపు జాబితాను 8వ తేదీన విడుదల చేస్తామని, అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలో 12వ తేదీలోగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు అభ్యర్థులు తమ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Mains | గ్రూప్ -1లో మెయిన్స్ పరీక్షల్లో మరోసారి కాపీయింగ్
Osmania University | లా కోర్సుల పరీక్షా ఫలితాలపై రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు