RS Praveen Kumar | తెలంగాణ ప్రజల భద్రతతో పోలీసు అధికారులు ఆడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తమ పోస్టింగ్‌ల కోసం పోలీసులు వికృత క్రీడలో భాగస్వాములయ్యారని తెలిపారు. హరీశ్‌రావు, కేటీఆర్‌కు సంబంధం లేని శాఖల గురించి పోలీసులు విచారణకు పిలిచారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ట్యాపింగ్‌కు సిట్ వేయడమే చట్ట వ్యతిరేకమని అన్నారు. కానీ 380 సాక్షులను విచారించారని మండిపడ్డారు. కానిస్టేబుళ్లు, హోంగార్డులను బలవంతంగా విచారించినట్లు తెలిసిందని అన్నారు. వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ వేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌కు పోలీసులకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఆ విషయం డీజీపీ, సీపీ సజ్జనార్‌కు కూడా తెలుసన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ గోప్యంగా జరుగుతుందని తెలిపారు. హోంమంత్రి, సీనియర్ ఐపీఎస్‌లకు కూడా ఎస్ఐబీ ఎక్కడ ఉంటుందో తెలియదని అన్నారు. ఫలానా విధంగా సమాచారం సేకరించినట్లు ప్రధాని, ముఖ్యమంత్రికి కూడా చెప్పరని తెలిపారు.
ఆరోజు నోటుకు ఓటు కేసులో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని కేసులు పెట్టారు!
ఇప్పుడు అదే సజ్జానార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తా అంటున్నాడు
రాజకీయ నాయకులను వేధించడానికి ఏర్పాటు చేసిన సిట్‌కు సజ్జనార్ చీఫ్‌గా ఉన్నాడు
సజ్జనార్ సిట్‌ను లీడ్ చేసి, ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే… pic.twitter.com/GMoRNdEL7w
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2026
ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సజ్జనార్ విచారణ ఎదుర్కొంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆ రోజు నోటుకు ఓటు కేసులో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని కేసులు పెట్టారని అన్నారు. ఇప్పుడు అదే సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తా అంటున్నాడని అన్నారు. రాజకీయ నాయకులను వేధించడానికి ఏర్పాటు చేసిన సిట్‌కు సజ్జనార్ చీఫ్‌గా ఉన్నాడని తెలిపారు. సజ్జనార్ సిట్‌ను లీడ్ చేసి, ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత లేదన్నారు. రూ.50లక్షలతో దొరికినప్పుడు సీఐడీ డీసీపీగా కూడా సజ్జనార్ ఉన్నారని.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నాడన్నారు. ఆనాడు సజ్జనార్, ఇంకా కొంతమంది అధికారులు తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఏపీలో కేసులు ఉన్నాయని తెలిపారు. ఏ అర్హతత ట్యాపింగ్ విచారణ చేస్తున్నారో చెప్పాలని సజ్జనార్‌ను డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్‌రావుపై పెట్టిన కేసు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. అయినప్పటికీ ఆయన్ను సిట్ విచారణకు పిలిచిందని మండిపడ్డారు. సీనియర్ మంత్రులను 9 గంటల పాటు విచారించాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు.