గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 19:11:21

కొవిడ్‌ బాధితులు 5-6 గంటల లోపు ఓటు వేయొచ్చు : ఎస్‌ఈసీ

కొవిడ్‌ బాధితులు 5-6 గంటల లోపు ఓటు వేయొచ్చు : ఎస్‌ఈసీ

హైదరాబాద్‌ :  కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్‌ దృష్ట్యా గతంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను సంఖ్యను పెంచింది. కొవిడ్‌ బాధితులు ఓటు వేసేందుకు ప్రత్యేక సమయం కేటాయించింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు కొవిడ్‌ బాధితులు ఓటు వేయొచ్చని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

వికలాంగులు, వృద్ధులు, బాలింతలు నేరుగా వెళ్లి పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయొచ్చని సూచించింది. పోలింగ్‌ కేంద్రాలకు రాలేని దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు, కొవిడ్‌ బాధితులకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.  వికలాంగులు, వృద్ధుల కోసం పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులు ఏర్పాటు చేశామని, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచామని తెలిపింది. వీల్‌చైర్లను తీసుకెళ్లేందుకు వలంటీర్లను సైతం నియమించామని వెల్లడించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.