నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో నిందితునిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మిగిలిన ఐదుగురు నిందితులు ఎగ్జామినేషన్ ప్రక్రియకు తప్పక హాజరుకావాలని నాంపల్లిలోని ఈడీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో శుక్రవారం జరిగిన విచారణకు బిషప్ హ్యారీ సెబాస్టియన్, జెరూసలేం మత్తయ్య, సండ్ర వెంకటవీరయ్య కోర్టుకు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు రుద్రశివకుమార్ ఉదయ్‌సింహా, వేం కృష్ణ కీర్తమ్ల తరఫున వారి న్యాయవాదులు గైర్హాజరు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న కోర్టు వచ్చేనెల వాయిదాకు నిందితులందరూ కోర్టుకు హాజరుకావాలని సూచించింది.