విద్యుత్ షాక్తో దంపతుల మృతి
విద్యుదాఘాతంతో దంపతులు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్వాపురం గ్రామానికి చెందిన బానోతు శ్రీను(42), షమీన(40) 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కూతురు ఉంది.
కారేపల్లి, ఆగస్టు 19: విద్యుదాఘాతంతో దంపతులు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్వాపురం గ్రామానికి చెందిన బానోతు శ్రీను(42), షమీన(40) 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కూతురు ఉంది. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే సోమవారం ఉదయం షమీన బట్టలను ఇంటి ఎదుట ఉన్న ఇనుప తీగ(దండెం)పై ఆరేస్తుండగా.. ఆ తీగకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్తో అక్కడికక్కడే పడిపోయింది.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షమీన అప్పుడప్పుడు స్పృహతప్పి పడిపోతూ ఉండేది. గమనించిని ఆమె భర్త శ్రీను.. షమీన అలాగే పడిపోయిందనుకొని తన భార్యను లేపేందుకు యత్నించాడు. దీంతో అతడికి కూడా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. గమనించిన శ్రీను స్నేహితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ దంపతులను వెంటనే ఇల్లెందు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. కుమార్తె ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై రాజారాం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

