హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): తిరుమలలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. నందకం అతిథిగృహంలోని 203వ నంబర్ గదిలో తిరుపతి అబ్బన్నకాలనీకి చెందిన శ్రీనివాసులునాయుడు, ఆయన భార్య అరుణ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం గది అద్దెకు తీసుకున్న ఇరువురు శుక్రవారం కూడా బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి కిటికీలు తెరిచి చూడగా ఈ ఘోరం కనబడింది. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.