దిలావర్పూర్, జనవరి 17 : అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ ప్రాంతంలో జరిగింది. దిలావర్పూర్ ఎస్ఐ సందీప్ వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం చించోలి (బీ)కి చెందిన కొరిపెల్లి భాస్కర్‌రెడ్డి (60), అనసూయ (52) దంపతులకు ఇద్దరు కుమారులు.18 నెలల క్రితం భాస్కర్‌రెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగ విరమణ పొందాడు.
కొన్ని రోజుల క్రితం నూతన గృహం నిర్మించాడు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. గురువారం దవాఖానకు వెళ్తున్నామని కుటుంబసభ్యులకు చెప్పి దంపతులిద్దరూ ఇంటినుంచి వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం సారంగాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులకు భాస్కర్‌రెడ్డి సెల్‌ఫోన్ లొకేషన్ కాల్వ అటవీ ప్రాంతంలో చూపించింది. వారు అక్కడికి వెళ్లి పరిశీలించగా దంపతులిద్దరూ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించారు.