Muncipal Elections : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు ధీటుగా బీఆర్ఎస్ హవా కనబర్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చి సత్తా చాటింది. బీఆర్ఎస్ పార్టీ 15 మున్సిపాలిటీల్లో విజయం సాధించగా.. మరో 20కి పైగా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. మరో 10కి పైగా మున్సిపాలిటీల్లో, 6 మున్సిపల్ కార్పోరేషన్లలో తుది ఫలితాలు రావాల్సి ఉంది.
సాయంత్రానికి అందిన ఫలితాల ప్రకారం.. మొత్తం 116 మున్సిపాలిటీలకుగానూ కాంగ్రెస్ 50కి పైగా మున్సిపాలిటీలు గెలుచుకుంది. బీఆర్ఎస్ 15 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. ఇతరులు రెండు మున్సిపాలిటీలు దక్కించుకున్నారు. దాదాపు 35కు పైగా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇక ఏడు మున్సిపల్ కార్పోరేషన్లకుగానూ నాలుగు కార్పోరేషన్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అందులో నల్లగొండ, రామగుండం, మంచిర్యాల, మహబూబ్‌నగర్ కార్పోరేషన్లు ఉన్నాయి.
కొత్తగూడెం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. అక్కడ మొత్తం 60 డివిజన్లకుగానూ కాంగ్రెస్, సీపీఐ 22 చొప్పున గెలిచాయి. బీఆర్ఎస్ 8 డివిజన్లలో, ఇండిపెండెంట్లు 6 డివిజన్లలో, బీజేపీ, ఇతరులు ఒక్కో డివిజన్లో గెలిచారు. కరీంనగర్ కార్పోరేషన్‌ను బీజేపీ దక్కించుకుంది. నిజామాబాద్‌లో కూడా బీజేపీ ముందంజలో ఉంది.