మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 11:45:36

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఎదురుకాల్పులు

కొత్తగూడెం క్రైం : ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు జరిగాయి. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిర్మగోండా అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాల  ధాటికి తట్టుకోలేకపోయిన మావోయిస్టులు పక్కనే ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోకి కాల్పులు జరుపుతూ పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం భద్రతా బలగాలు సంఘటనా స్థలం నుంచి భారీగా మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలు, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.