హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ దళ్ డి మాండ్ చేసింది. బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి బుధవారం పకటన విడుదల చేశారు. సామాజిక న్యాయం పేరుతో బీజేపీ మాటలు చెప్పడమే తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సైతం అదే తీరుగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు పెంచకుంటే పరిషత్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.