హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): శాసనసభ ప్రాంగణంలో ప్రభుత్వ విప్‌లకు కేటాయించిన నూతన చాంబర్లను సోమవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌కు నూతన చాంబర్లు కేటాయించారు.
ఈ సందర్భంగా నూతన చాంబర్లలో ఆసీనులైన విప్‌లకు మండలి చైర్మన్, స్పీకర్, మంత్రులు అభినందనలు తెలిపారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలోని మీడియా అడ్వైజరీ కమిటీ నూతన కార్యాలయాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు.