Cotton | హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పంటల సాగుకు సమయం మించిపోలేదని, వర్షాల ఆలస్యంపై రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని, విత్తనాలు విత్తేందుకు రైతులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. పలు పంటల సాగులో పాటించాల్సిన మెళుకువలను వ్యవసాయ యూనివర్సిటీ పరిశోధనా విభాగం డైరెక్టర్ రఘురామిరెడ్డి రైతులకు సూచించారు.
వివిధ పంటల సాగుకు సూచనలు