జమ్మికుంట/కాశీబుగ్గ, మార్చి15: రాష్ట్రంలో పత్తి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే క్వింటాల్‌కు రూ.10 వేలను దాటేయగా, మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.10, 510గా నమోదైంది. ఇది జమ్మికుంట కాటన్ మార్కెట్ యార్డు చరిత్రలో ఆల్‌టైం రికార్డు అని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ వల్లనే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోనూ రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ పత్తికి రూ.10,235 పలికింది. పత్తికి అధిక ధరలు పలుకడం తో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.