వరంగల్ : తెల్ల బంగారం తెలంగాణ రైతులకు సిరులు కురిపిస్తున్నది. జిల్లాలో పత్తి ధర పరుగులు పెడుతున్నది. రోజు రోజుకు పత్తి ధరలు పసిడిలా పరుగులు పెడుతుండటంతో అన్నదాతలకు కాసుల వర్షం కురుస్తున్నది.
సోమవారం వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్
పత్తి ధర రూ.9,310 పలికినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.