చిట్యాల, జనవరి 9 : నల్లగొండ జిల్లా చిట్యాలలోని సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోళ్లను నిలిపేస్తున్నట్టు అధికారులు ప్రకటించడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కా రు. గురువారం పత్తి తీసుకువచ్చి రైతులు బ స్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై ధ ర్నా చేశారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ చేరుకుని ఆందోళన విరమింపజేసే క్రమంలో రైతులు, పోలీసుల కు మధ్య వాగ్వాదం జరిగింది.
సీఐ నాగరా జు, ఎస్ఐ ధర్మా రైతులతో కలిసి సీసీఐ కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుని అధికారులతో చర్చలు జరిపారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి జానయ్య పాల్గొన్నారు. పత్తిని శుక్రవారం కొనుగోలు చేసేందుకు సీసీ ఐ అధికారులు ఒప్పుకోవడంతో పత్తి లోడ్లను మిల్లులోకి పంపించారు.