చారకొండ, డిసెంబర్ 30 : నాగర్‌కర్నూల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న తిరుమల కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రంలో వారంరోజులుగా కొనుగోళ్లు ఆపేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మర్రిపల్లి సమీపంలో పత్తి వాహనాలను కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై అడ్డంగా నిలిపి రాస్తారోకో చేపట్టారు.
తేమ, కాయ పేరుతో పూర్తిస్థాయి ధర ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నారని వాపోయారు. కిరాయి ట్రాక్టర్లలో పత్తిని తీసుకొచ్చి ఏడు రోజులుగా ఇక్కడే ఉండడంతో కిరాయి పెరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ధర్నాతో వాహనాలు నిలిచిపోగా.. ఎస్సై శంషొద్దీన్ మార్కెట్ కార్యదర్శి కిరణ్‌కు విషయం తెలిపారు. కిరణ్‌తోపాటు సీసీఐ అధికారులు వచ్చి పత్తిని కొంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విమరించారు.