 
                                                            లింగాపూర్,అక్టోబర్ 30 : అప్పుల బాధతో ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం సీతారాంనాయక్ తండాలో జరిగింది. ఎస్ఐ గంగన్న కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండకు చెందిన జాదవ్ బలిరాం(59)కు తన తండ్రి నుంచి వచ్చిన పదెకరాల భూమి సీతారాంనాయక్ తండాలో ఉంది. మూడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. నిరుడు అప్పుచేసి పంట సాగు చేయగా, సరిగా దిగుబడి రాలేదు. ఈ ఏడాది ఐదెకరాల్లో పత్తి, మూడెకరాల్లో కంది, రెండెకరాల్లో జొన్న సాగు చేశాడు. ప్రస్తుతవర్షాతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. పెట్టుబడికి చేసిన రూ.3 లక్షల అప్పు తీర్చలేక మనస్తాపం చెంది బుధవారం రాత్రి చేను వద్ద పురుగులమందు తాగాడు. ఇంటికి రాగా కుటుంబసభ్యులు గమనించి సిర్పూర్ దవఖాన, అక్కడి నుంచి ఊట్నూర్ దవఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు.
 
                            