హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : పత్తి కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మారెటింగ్శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం పత్తి కొనుగోళ్లపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇప్పటి వరకు రూ. 82.44 కోట్ల విలువైన 11,255 టన్నుల పత్తిని 5,251 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపారు.
పత్తి కొనుగోళ్లను కలెక్టర్లు, మారెటింగ్ అధికారులు పర్యవేక్షించాలని, 8897281111 వాట్సాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను మారెటింగ్ శాఖ సంచాలకులు పరిశీలించి, తిరిగి ఫోన్ ద్వారా పరిషరించాలని ఆదేశించారు. మంగళవారం వరకు 188 ఫిర్యాదు లు స్వీకరించి వాటిలో 157 పరిషరించినట్టు తెలిపారు.