కాశీబుగ్గ, అక్టోబర్25: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో 4 గంటల పా టు జాప్యం జరిగింది. దీంతో రైతులు, కార్మికులు ఇబ్బందులకు గురయ్యారు. మార్కెట్ కమిటీ పరిధిలోని పత్తియార్డులో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పత్తికి వేలం పాట నిర్వహిస్తుండగా రైతు సంఘం నాయకుడు మోర్తాల చందర్రావు బృం దం అక్కడకు వచ్చింది.
వెంటనే ఖరీదు వ్యాపారులు రైతు సంఘం నాయకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరగా.. తాము వేలంపాట పరిశీలిస్తామని చెప్పారు. దీంతో సం ఘం వారు ఉంటే తాము పత్తిని కొ నుగోలు చేయలేమని ఖరీదు వ్యాపారులు బయటకు వెళ్లిపోయారు. రైతు సంఘం నాయకుడు మోర్తాల చందర్రావు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇంత లో కార్యదర్శి పోలెపాక నిర్మల ఘట నా స్థలానికి చేరుకొని వెంటనే రైతు సంఘం నాయకులను మార్కెట్ ప్రధాన కార్యాలయానికి రావాలని కోరగా.. వారు వెళ్లకపోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోలీసులు చేరుకొని అక్కడ రైతు సం ఘం నాయకులతోపాటు చాంబర్ ప్రతినిధులు, పత్తి ఖరీదు వ్యాపారుల తో సమావేశం నిర్వహించారు. రైతు సంఘం ప్రతినిధులు రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఖరీదు వ్యాపారులపై పెత్తనం చేయకూడదని చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి సూచించారు.