నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. వర్షాలకు పత్తి, వరి పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా వరద నీటిలో తేలియడుతున్నాయి. వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న వందలాది ఎకరాల్లాలోని పత్తి చేనులోకి వరద నీరు చేరడంతో పత్తి మొక్కలు పూర్తిగా బురదలో కురుకుపోయాయి. వందలాది ఎకరాలలో బురద చేరడంతో మొక్కలు చనిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇంకా పలు ఎకరాలలో వరదా నీరు నిలిచే ఉన్నాయి. నెన్నెల, మన్నెగూడెం, గొల్లపల్లి, నందులపల్లి, అవుడం, గంగారం గ్రామాలలో వరి నాట్లు వేసిన పొలాలు పూర్తిగా నీటిలో మునగడం తో వరి నాట్లు కుళ్లి పోతున్నాయని రైతులు తెలిపారు. పలు ఎకరాలలో వరద ఉధృతికి నారు కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేసి చేతికి రాకుండా పోయింది. చేరువులు, కాలువలకు గండ్లు పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నష్ట పోయిన పంటలను పరిశీలించి ఆదుకోవాలని కోరుతున్నారు.