కరీంనగర్ విద్యానగర్, జూన్ 4: కరీంనగర్ జిల్లాకేంద్రంలో కరోనా కలకలం రేగింది. ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా సోకినట్టు తెలిసింది. అయితే ప్రైవేట్ వైద్యులు గుర్తించి బుధవారం జిల్లాకేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు వెంటనే ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రభుత్వ దవాఖానలో కిట్లు లేకపోవడంతో కరోనా టెస్ట్ చేయలేదని తెలిసింది. ఈ మధ్యకాలంలో ఇది మొదటి కేసు కావడంతో వైద్యులు సిబ్బంది అప్రమత్తమయ్యారు.