సిరిసిల్ల రూరల్, నవంబర్ 15: సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌కు బేడబుడిగ జంగాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని ఫంక్షన్హాల్లో నిర్వహించిన దళిత బేడబుడిగ జంగాల ఆత్మీయ సమ్మేళనంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతల యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బేడబుడిగ జంగాలకు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అండగా నిలిచారని కొనియాడారు. అన్నివిధాలా వెన్నంటే ఉంటున్న బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌కే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మేళనానికి హాజరైన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రామ్మోహన్‌కు వారు ఏకగ్రీవ తీర్మాన పత్రాలు అందజేశారు.