హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పేరు తీయకుం టే.. ‘ఆర్ఎస్ బ్రదర్స్’కు బతుకే లేదని నిరూపించుకుంటున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి విమర్శించారు. అబద్ధాలలో బండి, రేవంత్ పోటీపడుతున్నారని..‘రేవంత్ కోసం బండి సంజయ్.. బండి సంజయ్ కోసం రేవంత్‌రెడ్డి’ అల్లాడిపోతున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కేసీఆర్ కుటుంబం ఫేక్ కరెన్సీ ముంద్రించిందని అనడం చిల్లర రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.