నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో రైతులు సాగు చేసిన పంటలను గుత్తేదారులు నేలపాలు చేశారు. కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భాగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం.. రైతులకు పూర్తి పరిహారం ఇవ్వకపోగా, చేతికి వచ్చిన పంటలను జేసీబీలతో ఇలా ధ్వంసం చేసింది.

యూరియా పంపిణీ చేయలేక, యాప్ పేరిట ముప్పుతిప్పలు పెడుతున్న సర్కార్ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేశారు.

ఉడికీ ఉడకని అన్నం, నీళ్లచారుతో తమ కడుపు కొడుతున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్కార్ తీరును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జూకల్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అన్నం ప్లేట్లను జాతీయ రహదారిపై విసిరేశారు.