 
                                                            Jubilee Hills By Poll | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్ట్ వర్క్స్ లేక టీ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నాం అని ఓ టీ షాప్ నిర్వాహకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌కు తన గోడును వెల్లబోసుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “మాట ముచ్చట” కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే వివేకానంద్ బోరబండ సైట్ – 3లోని ఫేమస్ టీ పాయింట్లో టీ లవర్స్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా బూచితో నూతన నిర్మాణాలు చేపట్టక, చేపట్టిన నిర్మాణాలు అమ్ముడుకాక, కాంట్రాక్ట్ వర్కులు బంద్ చేసి టీ షాప్ నిర్వహించుకుంటున్న వైనాన్ని టీ షాప్ నిర్వాహకులు మహమ్మద్ అబ్దుల్ ఫసీర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్‌కు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ సార్ ప్రభుత్వంలో హైదరాబాద్ నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి జరిగింది. అప్పుడు నిర్మాణ రంగంలో పనులు విపరీతంగా ఉండేవని, ఉపాధి కూలీలకు చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉండేవని, నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణ రంగంలో నూతన పనులు ఆ కూలీలకు డబ్బులు ఇవ్వలేక, కాంట్రాక్టులు వదిలి టీ షాప్ నిర్వహించుకుంటూ జీవిస్తున్నాం. పేద ప్రజల బ్రతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ సారే రావాలి అని అబ్దుల్ పేర్కొన్నారు.
 
                            